సీఎం నోరు తెరిచి మాట్లాడితే అమర్నాథ్‌పై పెట్రోల్ పోసి చంపేవాళ్లా.? : దేవినేని ఉమా

Ex Minister Devineni Uma Fire On CM Jagan. వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులకు

By Medi Samrat  Published on  18 Jun 2023 3:00 PM GMT
సీఎం నోరు తెరిచి మాట్లాడితే అమర్నాథ్‌పై పెట్రోల్ పోసి చంపేవాళ్లా.? : దేవినేని ఉమా

వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులకు న్యాయం చేయాల‌ని, నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ స్టేషన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లరిమూకల అరాచకాలు, దురగతాలు నానాటికీ పెరిగిపోతున్నాయ‌ని.. అందుకు ముఖ్యమంత్రి జగన్‌, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలే బాధ్యత వహించాలని అన్నారు.

జగన్ రెడ్డి..! మీ ఎంపీ పిల్లల్ని కుటుంబ సభ్యుడిని పట్టుకుని కొడితే నోరు తెరవడం లేదు. ముఖ్యమంత్రి నోరు తెరిచి మాట్లాడితే అమర్నాథ్ పై పెట్రోల్ పోసి చంపేవాళ్లా అని ప్ర‌శ్నించారు. హనుమాయమ్మ సంఘటన జరిగిన నాడే ముఖ్యమంత్రి స్పందించి ఉంటే.. ఈ సంఘటనలు జరిగేవి కావని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్‌ కంట్రోల్లోకి వచ్చిందని, విశాఖపట్నంలో రౌడీయిజం లేదని, భూ కబ్జాలు లేవని డీజీపీ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు విశాఖలో జరిగిన కిడ్నాప్‌ ఘటనే పరాకాష్ట అని అన్నారు. తిరుమల తిరుపతి కొండ కిందే అరాచకాలు జరుగుతున్నాయన్నారు. 100 కోట్లు చేతులు మారాయి.. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? అని ప్ర‌శ్నించారు. మూడు వారాలు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణ చేసింది. నెలాఖరులోగా తాడేపల్లి కొంపకు నోటీసులు వస్తాయని అన్నారు.


Next Story