మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.

By Medi Samrat  Published on  22 Aug 2024 6:30 PM IST
మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టారని, వాహనాలను ధ్వంసం చేశారని వైఎస్ జగన్ అన్నారు. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు.

"ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?" అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.

Next Story