ఏపీలో ప్రతి శనివారం హౌసింగ్ డే

Every Saturday is Housing Day in AP.. CM YS Jagan. సొంత ఇళ్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం జగన్‌

By అంజి  Published on  24 Nov 2022 9:02 PM IST
ఏపీలో ప్రతి శనివారం హౌసింగ్ డే

సొంత ఇళ్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం జగన్‌ అన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి అన్ని కాలనీల్లో కనీస మౌలిక వసతులైన విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణ శాఖపై గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ, 5,655 కోట్లు వెచ్చించిందని, ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ ఆవశ్యకతను ఎత్తిచూపుతూ, గృహనిర్మాణ రంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అధికారిక యంత్రాంగం ఎప్పటికప్పుడు తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ప్రతి శనివారం హౌసింగ్ డేగా పాటిస్తున్నామని, ఆ రోజు తప్పకుండా తనిఖీ బృందాలు లే అవుట్‌లను సందర్శించి ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తున్నాయని అధికారులు ఆయనకు తెలియజేయగా.. వాటి వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.

నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, ఆప్షన్ 3 ఎంచుకున్న వ్యక్తులకు ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. నిర్మాణ బృందాలకు అందుబాటులో ఉంచే ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)ను కచ్చితంగా పాటించి నిర్మాణ నాణ్యతలో రాజీ పడకుండా అన్ని లే అవుట్‌లలో ప్రాధాన్య పనులను గుర్తించాలని ఆయన ఆదేశించారు. గృహాల నాణ్యతను నిర్ధారించడానికి నాణ్యత నియంత్రణ చర్యలను వర్తింపజేయాలి. ఇళ్ల నిర్మాణంలో ప్రతి దశలో నాణ్యత మూల్యాంకన పరీక్షలను నిర్వహించాలన్నారు.

మౌళిక వసతుల కల్పనకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలియజేయగా.. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మూడు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఇతర మౌలిక సదుపాయాలపై పనులు ఏకకాలంలో సాగుతాయి. గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సేవలు అవసరమైన చోట అందుబాటులో ఉండాలని, నాణ్యత పాటించడంలో వారిని భాగస్వాములను చేయాలని సూచించారు.

Next Story