నా లాంటి వాళ్లు వెయ్యి మంది వీడినా పార్టీకి నష్టంలేదు : విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాజకీయాల నుంచి వైదొలగిన తర్వాత తన రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు.

By Knakam Karthik  Published on  25 Jan 2025 3:26 PM IST
Andrapradesh, vijayasai reedy resign to rajyasabha, ysrcp, tdp

నా లాంటి వాళ్లు వెయ్యి మంది వీడినా పార్టీకి నష్టంలేదు..ఎంపీ పదవికి రాజీనామా తర్వాత విజయసాయి కీలక వ్యాఖ్యలు

రాజకీయాల నుంచి వైదొలగిన తర్వాత తన రాజ్యసభ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన ఎంపీ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు అందించానని, రాజీనామాను ఆమోదించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. లండన్‌లో ఉన్న వైఎస్‌ జగన్‌కు ఫోన్‌ చేసి చెప్పానని విజయసాయిరెడ్డి వివరించారు. అయితే, రాజీనామా చేయొద్దని, తాను, పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. రాజీనామా అంశం సరికాదని, దీనిపై పునరాలోచించాలని జగన్ సూచించారని అన్నారు.

వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్ మరోసారి స్పష్టం చేశారు. లండన్‌లో ఉన్న జగన్‌తో అన్ని అంశాలు మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని చెప్పారు. తాను రాజీనామా చేయడం కూటమికే లబ్ధి చేకూరుతుందని అన్నారు. వైసీపీలో తన ప్రాతినిధ్యాన్ని ఎవరూ తక్కువ చేయలేరని విజయసాయిరెడ్డి తెలిపారు. తనలాంటి వాళ్లు 1000 మంది పార్టీ వీడినా జగన్‌కి, పార్టీకి నష్టం లేదని చెప్పారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, భవిష్యత్‌లో తాను రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు.

Next Story