పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ అరెస్టుకు కారణం

అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మరిచిపోవడమే అరెస్టుకు కారణమని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు సంచలన ఆరోపణలు చేశారు

By Medi Samrat
Published on : 17 Dec 2024 8:23 PM IST

పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ అరెస్టుకు కారణం

అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మరిచిపోవడమే అరెస్టుకు కారణమని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు సంచలన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లగచర్ల రైతులపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు.

తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో కల్తీ ఆహారంతో విద్యార్థులు చనిపోతున్నారని, చాలామంది అస్వస్థతకు గురవుతున్నారని ఎర్రబెల్లి బాధపడ్డారు. కల్తీ ఆహారం విషయంలో కేసు పెట్టవలసి వస్తే మొదట ముఖ్యమంత్రి పైనే పెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

Next Story