మాగుంట నివాసాల్లో ఈడీ సోదాలు

Enforcement Directorate Raides in Nellore Magunta Office. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

By Medi Samrat  Published on  16 Sept 2022 6:07 PM IST
మాగుంట నివాసాల్లో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 40కి పైగా లొకేషన్లలో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాదులో 20 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఏపీలోని నెల్లూరులో కూడా సోదాలు జరుగుతున్నాయి.

వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరులోని నివాసంతో పాటు, ఢిల్లీ నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ స్కామ్ లో మాగుంటపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలోని వైన్ షాపుల్లో కొన్నింటిని మాగుంటకు చెందిన లిక్కర్ కంపెనీలు చేజిక్కించుకున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాగుంట నివాసాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. మాగుంటతో పాటు మరికొందరు నేతల హస్తం కూడా ఈ స్కాంలో ఉందని ఈడీ ఆరోపిస్తోంది.

దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్‌రెడ్డి, అభిషేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట, దోమలగూడలో తనిఖీలు నిర్వహించారు. ఇందిరాపార్క్ దగ్గర శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో ఈడీ సోదాలు చేపట్టింది.


Next Story