రూ.5 కోట్లు డిమాండ్ చేసి, రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు

ఆంధ్రప్రదేశ్‌లో ఓ అవినీతి అధికారి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు

By Knakam Karthik
Published on : 8 Aug 2025 1:42 PM IST

Andrapradesh, ACB, Tribal Department, ENC Srinivas

రూ.5 కోట్లు డిమాండ్ చేసి, రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు

ఆంధ్రప్రదేశ్‌లో ఓ అవినీతి అధికారి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నానికి చెందిన శ్రీ సత్య సాయి కన్‌స్ట్రక్షన్స్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ సబ్బవరపు శ్రీనివాస్ రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడని బాధితులు ఏసీబీకి కంప్లయింట్ చేశారు. అయితే ఒప్పందంలో భాగంగా రూ. 25 లక్షలు లంచం చేసుకుంటూ దొరికిపోయాడు. వివిధ ప్రాంతాల్లో డీవియేషన్ పనులు చేపట్టిన బిల్లులు పెండింగ్‌లో చెల్లింపు కోసం కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు.

మేనేజింగ్ పార్టనర్ చెకూరి కృష్ణంరాజు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన ఒప్పంద పనులను అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో డీవియేషన్ పనులు చేపట్టిన నేపథ్యంలో, ప్రభుత్వం వద్ద నుంచి కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఈ పనులు చేపట్టబడ్డాయి. అయితే ఈ డీవియేషన్ పనులకు అనుమతులు మంజూరు చేయాలంటే, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ సబ్బవరపు శ్రీనివాస్ కాంట్రాక్టర్ వద్ద రూ. 5 కోట్ల లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఆ మొత్తాన్ని చెల్లించలేనని చెప్పినప్పుడు, మొదటగా రూ. 25 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్‌ను తగ్గించారు. అయితే కాంట్రాక్టర్ లంచం ఇవ్వడానికి అంగీకరించక, విజయవాడ ACB అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుతో ACB అధికారులు క్రైం నెం. 6/RCT-ACB-VJA/2025 కింద, PC (Amendment) Act, 2018 యొక్క విభాగాలు 7(a) & 7(b) ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం గురువారం రోజు సబ్బవరపు శ్రీనివాస్ రూ. 25 లక్షల లంచం తీసుకుంటూ అఫీసులోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాగా శ్రీనివాస్‌ అంతకు ముందు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

Next Story