ఏలూరులో పెరుగుతున్న బాధితులు.. 450కి చేరిన బాధితుల సంఖ్య

Eluru incident.. 450 victims.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వింత వ్యాధితో వచ్చే రోగుల సంఖ్య క్రమ

By సుభాష్  Published on  7 Dec 2020 11:43 AM GMT
ఏలూరులో పెరుగుతున్న బాధితులు.. 450కి చేరిన బాధితుల సంఖ్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వింత వ్యాధితో వచ్చే రోగుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతోంది. అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. ఇప్పటి వరకు 450 వరకు చేరింది. మూర్ఛ వ్యాధి, తల తిరగడం, నోట్లో నురుగ వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇప్పటి వరకు 243 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు. ఇంకా 183 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అలాగే కాస్త ఆందోళనకరంగా ఉన్న 16 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యవారు కాగా, 12 ఏళ్ల లోపు పిల్లలు 45 మందికిపైగా ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోవడం, వింత గా ప్రవర్తించండం వంటివి చేస్తూ ఆస్పత్రిలో చేరుతున్నారు.

వరకు వ్యాధికి సంబంధించి కారణాలు తెలియడం లేదు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినా అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు. దీనికి కారణాలు తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ బృందం ఇప్పటికే నమూనాలను సేకరించింది. మరింత లోతుగా పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

వింత వ్యాధితో ఆస్పత్రుల్లో చేరుతుండటంతో దోమల మందు దీనికి కారణమై ఉంటుందా.? అన్న కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్గనో క్లోరినో అనే రసాయణం కారణం కావచ్చన్న అధికారులు చెబుతున్నారు. కానీ నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ వ్యాధికి గల అసలైన కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Next Story
Share it