గ్లాస్ గుర్తు విషయంలో జనసేనకు వరుస షాక్ లు

గ్లాస్ గుర్తు విషయంలో జనసేనకు వరుస షాక్ లు కలుగుతూనే ఉన్నాయి. గ్లాస్ గుర్తు అంటే చాలు జనసేన అంటూ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు

By Medi Samrat  Published on  2 May 2024 8:51 AM IST
గ్లాస్ గుర్తు విషయంలో జనసేనకు వరుస షాక్ లు

గ్లాస్ గుర్తు విషయంలో జనసేనకు వరుస షాక్ లు కలుగుతూనే ఉన్నాయి. గ్లాస్ గుర్తు అంటే చాలు జనసేన అంటూ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి అభ్యర్థుల్లో ఊహించని కన్ఫ్యూజన్ నెలకొంది.

ఇక జనసేనకు చెందిన గాజుగ్లాసు గుర్తుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) తాజా ఉత్తర్వులు మరింత షాక్ ఇచ్చాయి. జనసేన పోటీచేసే రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఇతరులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్‌. ఆ పార్టీ బరిలోకి దిగిన 21 అసెంబ్లీ స్థానాలున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులెవరికీ గ్లాస్ గుర్తు ఇవ్వొద్దని రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలిచ్చామని ఈసీ హైకోర్టుకు నివేదించింది. కోర్టు దీనిపై విచారణను కూడా ముగించేయడం జనసేనకు మరింత షాక్ ఇచ్చే అంశం.

గాజుగ్లాసు గుర్తును ఇతర స్వతంత్ర అభ్యర్థులెవరికీ కేటాయించకుండా జనసేనకే రిజర్వ్‌ చేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారమే అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. గుర్తింపులేని రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులకు గానీ, స్వతంత్ర అభ్యర్థులకు గానీ ఈ గుర్తును కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు గురువారం విచారణ జరుపనుంది. ఇప్పటికే చాలా మంది స్వతంత్ర్య అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుతో ప్రచారాలు కూడా మొదలు పెట్టేయడంతో కోర్టు నుండి ఎలాంటి తీర్పు వస్తుందోనని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story