నెల్లూరు జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ఈరోజు(బుధవారం) ఉదయం జిల్లాలోని నాలుగు మండలాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. నాలుగు మండలాలు దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాలతో పాటు మర్రిపాడు మండలంలో భూ ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పలువురి ఇళ్లలోని వస్తువులు కిందపడడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా.. గతంలోనూ పలుమార్లు నెల్లూరు జిల్లాలో భూమి కంపించిన సంగతి తెలిసిందే.
కడప జిల్లా బద్వేలు మండలంలోనూ భూమి కంపించిందని విద్యానగర్, చిన్నకేశంపల్లి గ్రామస్థులు తెలిపారు.