చిత్తూరు జిల్లాలో భూమి కంపించింది. గత రాత్రి పది సెకన్ల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయ భ్రాంతులకు గురైయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలమనేరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు చెప్పారు. కొందరి ఇళ్లలోని వస్తువులు ప్రకంపనల కారణంగా కిందపడినట్లు తెలిపారు. 15 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు కంపించిందని స్థానికులు అంటున్నారు. కాగా.. ఇప్పటి వరకు ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదు.
ఇదిలా ఉంటే.. గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల క్రితం జపాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. జపాన్‌లోని పెద్ద ద్వీపకల్పమైన హోన్షుకి దక్షిణ తీరంలోని కన్సాయ్ ప్రాంతంలో మై ప్రెఫెక్టర్ దగ్గర 357 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.