చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. వరుసగా రెండో రోజు కూడా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. రామకుప్పం మండలంలోని గడ్డూరు, గిరిగేపల్లి, యానాదికాలనీ గ్రామాల్లో నిన్న సాయంత్రం నుంచి రెండు సార్లు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా ఇంటి బయటే జాగారం చేశారు. భూ ప్రకంపనల కారణంగా ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి. పలు చోట్ల గోడలకు బీటలు వారాయి. కాగా.. దీనిపై అధికారులు స్పందించారు. స్వల్ప భూ ప్రకంపనలేనని చెప్పారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.