నామినేషన్ వేయ‌ని వాణి.. దువ్వాడ శ్రీనివాస్‌కు ఇంటి పోరు లేనట్లేనా..?

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ మీద ఆయన భార్య దువ్వాడ వాణి పోటీకి సిద్ధమని చెప్పడం పెద్ద సంచలనంగా మారింది

By Medi Samrat  Published on  23 April 2024 7:05 AM GMT
నామినేషన్ వేయ‌ని వాణి.. దువ్వాడ శ్రీనివాస్‌కు ఇంటి పోరు లేనట్లేనా..?

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ మీద ఆయన భార్య దువ్వాడ వాణి పోటీకి సిద్ధమని చెప్పడం పెద్ద సంచలనంగా మారింది. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జెడ్పీటీసీ సభ్యురాలైన దువ్వాడ వాణి తన అనుచరుల సమక్షంలో ప్రకటించింది. ఆమె ఈ నెల 22న నామినేషన్‌ వేస్తానని చెప్పారు. కానీ నామినేషన్‌ దాఖలు చేయలేదు. అయితే ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగి దువ్వాడ వాణిని బుజ్జగించినట్టు తెలుస్తోంది. అందుకే దువ్వాడ వాణి వెనక్కి తగ్గినట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి పోరు లేనట్లేనని తెలుస్తోంది. తన భార్య వాణి నామినేషన్ వేస్తానన్న వ్యాఖ్యలపై అంతకు ముందు దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణి నా భార్య ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం ఉంది. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదని అన్నారు. అయితే దువ్వాడ వాణి పోటీలో నిలవడం లేదని తేలడం ఆయన వర్గానికి ఓ ఊరట అనే చెప్పొచ్చు.

Next Story