విద్యార్ధుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈరోజు కూడా విద్యా సంస్థలకు సెలవు

దసరా సెలవులు అయిపోయాయి. ఇక పిల్లలు స్కూల్స్ కు వెళ్లడం మొదలు పెట్టారు.

By Medi Samrat  Published on  14 Oct 2024 9:07 AM IST
విద్యార్ధుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈరోజు కూడా విద్యా సంస్థలకు సెలవు

దసరా సెలవులు అయిపోయాయి. ఇక పిల్లలు స్కూల్స్ కు వెళ్లడం మొదలు పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన ఉండడంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అక్టోబర్ 14 సోమవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవులు ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ధృవీకరించారు.

అల్పపీడనం నేపథ్యంలో సోమ వారం నుండి గురువారం వరకూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉంది. నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉందని, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Next Story