పులివెందులలో సీఎం జగన్‌పై పోటీ చేసే అభ్యర్థి ఎవరంటే.?

శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.

By Medi Samrat
Published on : 24 Feb 2024 3:02 PM IST

పులివెందులలో సీఎం జగన్‌పై పోటీ చేసే అభ్యర్థి ఎవరంటే.?

శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 24 ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇక జననసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు.

పులివెందులలో సీఎం జగన్‌పై పోటీకి టీడీపీ క్యాండిడేట్‌గా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (రవీంద్రనాథ్ రెడ్డి)ని పార్టీ అధిష్టానం ప్రకటించింది. గతంలో సీఎం జగన్‌పై సతీష్ రెడ్డి పోటీ చేయగా.. వైసీపీ చీఫ్ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1,80,127 ఓట్లలో జగన్మోహన్ రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి 42, 246 ఓట్లు సాధించారు. ఈసారి బీటెక్ రవి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Next Story