చంద్రబాబు వేలి ఉంగరం స్పెషాలిటీ తెలుసా?

Do you know Chandrababu's finger ring specialty?. టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో సింపుల్‌గా ఉంటారు. రాజకీయాల్లో ఆయన రూటే సపరేటు. ఆర్భాటాలకు దూరంగా ఉండే

By అంజి  Published on  7 July 2022 6:08 PM IST
చంద్రబాబు వేలి ఉంగరం స్పెషాలిటీ తెలుసా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో సింపుల్‌గా ఉంటారు. రాజకీయాల్లో ఆయన రూటే సపరేటు. ఆర్భాటాలకు దూరంగా ఉండే చంద్రబాబు.. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రాధారణతో సాధారణంగా కనిపిస్తారు. ప్రస్తుతం చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వేలుకు ఉంగరం ధరించడం కార్తకర్తలో ఆసక్తి కలిగించింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో జరిగిన మినీ మహనాడులో చంద్రబాబు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో చూపుడు వేలుకు ఉన్న ఉంగరాన్ని కార్యకర్తలు, ప్రజలు గమనించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.

తాజాగా రాజంపేట నియోజకవర్గ సమీక్షలో పాల్గొన్న టీడీకీ కార్యకర్తలు ఉంగరం గురించి చంద్రబాబును అడిగారు. దీంతో చంద్రబాబు ఆ ఉంగరం స్పెషాలిటీ గురించి కార్యకర్తలకు వివరించారు. ఉంగరంలో కంప్యూటర్‌తో అనుసంధానించిన మైక్రో చిప్ ఉందని చెప్పారు. ఈ ఉంగరంతో చాలా ప్రయోజనాలున్నాయన్నారు. ఇది తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌లో పంపుతుందని తెలిపారు. హార్ట్ బీట్‌ను, నిద్రిస్తున్న తీరును నమోదు చేస్తుందన్నారు. తర్వాతి రోజు కంప్యూటర్‌లో నమోదైన వివరాల ఆధారంగా వైద్యులు తనకు సలహా ఇస్తారని చంద్రబాబు తెలిపారు. అలాగే ప్రతి నాయకుడు, కార్యకర్త ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు హితోపదేశం చేశారు.

Next Story