ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి పండుగకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రేపటి నుండి మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. రేపు రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి సెలవు కావడంతో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. తొలుత దీపావళి పండుగ సెలవు నంబర్ 12న ఉండగా.. ప్రభుత్వం దాన్ని 13వ తేదీకి మారుస్తూ జీవో ఇచ్చింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలియజేశారు.
రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఓ 2167 ద్వారా 13వ తేదిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నవంబర్ 11 రెండో శనివారం, 12 ఆదివారం కావడంతో ఒకేసారి పండుగకు 3 రోజులు సెలవులు వచ్చినట్లయింది. హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి అందరూ టపాసులు కాలుస్తూ సంతోషంగా పండుగను జరుపుకుంటారు.