అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రేపు సాయంత్రం అమరావతిలో జరగనున్న డీఎస్సీ అభ్యర్థులకు అందజేసే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా భారీ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్యక్రమం జరిగే ప్రాంతం సభ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో సభ వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో మరలా ఎప్పుడూ సభ నిర్వహించేది త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు డీఎస్సీలో ఎంపిక అయిన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన అమరావతిలోని సచివాలయం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించి డీఎస్సీలో సెలక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.