వికేంద్రీరణకు మద్దతుగా దసరా పూజలు చేయండి

Dharmana Krishnadas Calls for Dussehra pujas In support of decentralization. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలకు

By Medi Samrat  Published on  3 Oct 2022 8:00 PM IST
వికేంద్రీరణకు మద్దతుగా దసరా పూజలు చేయండి

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా వికేంద్రీరణకు మద్దతుగా దసరా రోజు ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్ ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుతూ ఈ పూజలు చేయాలని అన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధిని మాత్రమే కోరుకునే వారి మనసులు మార్చాలని అమ్మవారిని వేడుకుంటూ విజయాలకు నెలవైన విజయదశమి రోజున అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలతో పాటు కొబ్బరికాయలు కొట్టాలని పేర్కొన్నారు.

వికేంద్రీకరణకు మద్దతుగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, విద్యార్థులను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. మండల పార్టీ అధ్యక్షులు తమ పరిధిలో లీడ్ తీసుకుని అన్ని వర్గాల వారిని కలుపుకుని కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు. పార్టీలో పదవులు ఉన్నవారితో పాటు, సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పిటిసిలు కౌన్సిలర్లు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ వారి స్థాయిల్లో కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కృష్ణదాస్ కోరారు.


Next Story