శ్రీశైలంలో భక్తులకు తప్పిన ప్రమాదం

శ్రీశైలంలో భక్తులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. యాత్రికులు బస చేసిన ఓ వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించింది.

By -  Medi Samrat
Published on : 22 Feb 2026 9:20 AM IST

శ్రీశైలంలో భక్తులకు తప్పిన ప్రమాదం

శ్రీశైలంలో భక్తులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. యాత్రికులు బస చేసిన ఓ వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన భక్తులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. శ్రీశైలంలోని ఓ వీఐపీ కాటేజీ గదిలో ఉన్న ఎయిర్ కండిషనర్ (ఏసీ)లో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఏసీ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో గదిలో ఉన్న భక్తులు మంటలను గమనించి, భయంతో కేకలు వేస్తూ గది నుంచి బయటకు పరుగులు తీశారు. వారి అరుపులతో కాటేజీలోని ఇతర గదుల్లో ఉన్న వారు కూడా అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story