ఉదయం దేవుడు అంటారు.. రాత్రి అయితే అంత వెదవ లేడని తిడ‌తారు

Devineni Avinash Fire On Chandrababu. చంద్రబాబు టీడీపీ నేతల్ని పిలిపించి దైర్యం లేదా మగతనంలేదా అంటూ వైసీపీ నేతలని తిట్టటానికి

By Medi Samrat  Published on  14 Sept 2022 3:01 PM IST
ఉదయం దేవుడు అంటారు.. రాత్రి అయితే అంత వెదవ లేడని తిడ‌తారు

చంద్రబాబు టీడీపీ నేతల్ని పిలిపించి దైర్యం లేదా మగతనంలేదా అంటూ వైసీపీ నేతలని తిట్టటానికి సమావేశం పెట్టమన్నార‌ని ఆ పార్టీ నేత‌ దేవినేని అవినాష్ ఆరోపించారు. కొడాలినాని, వంశీ, అవినాష్ ల మీద శపథాలు చేయండి, తొడలు కొట్టండని చంద్ర‌బాబు చెప్పార‌ని.. స్టేజ్ మీద తొడలు కొట్టి, శపథాలు చేసినవాళ్లంతా ఎవరో.. వారి జాతకాలు ఏంటో నాకు తెలుసున‌ని అన్నారు.

దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మీ చీకటి బ్రతకులు నాకు తెలుసు. ఉదయం చంద్రబాబుని దేవుడు అంటారు.. రాత్రి అయితే చంద్రబాబు అంత వెదవ లేడని అంటారు. వైసీపీ నాయకుల కన్నా టీడీపీ నాయకులే చంద్రబాబుని ఎక్కువ తిడతారని అన్నారు. లోకల్ ఎలక్షన్స్ లో కూడా అభ్యర్థుల దగ్గర లక్షలు తీసుకొని టికెట్లు ఇస్తారని ఆరోపించారు. నా తండ్రి చేతులో గద్దె రామ్మోహన్ 18వేల ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు మర్చిపోయారా.. అని అడిగారు.

సీఎం జగన్ ను గాని, ఆయన కుటుంబాన్ని కానీ విమర్శిస్తే మాత్రం మేము గతంలో ఎలా రియాక్ట్ అయ్యామో.. ఇక మీదట అలానే రియాక్ట్ అవుతాం అని హెచ్చ‌రించారు. మైక్ ముందు పులులు, కార్ ఎక్కగానే పిల్లులు అయిపోతారని ఎద్దేవా చేశారు.

విజయవాడలో టీడీపీ భూస్ధాపితం అయిపోయింది. దేవినేని ఉమా నా గురించిమాట్లాడటం కాదు.. బీసీ నేత బుద్దా వెంకన్నని అవమానించారు.. దాని గురించి మాట్లాడండని సూచించారు. కాల్ మని,సెక్స్ రాకెట్ లో ప్రధాన పాత్రధారి గద్దె రామ్మోహన్ అని ఆరోపించారు. బురద రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.

వైసీపీ నేతలని మీరు ఒడిస్తామనటం సిగ్గు చేటు.. అంత సత్తా ఉంటే మీరే గత ఎన్నికల్లో గెలిచేవారని అన్నారు. దేవినేని ఉమాకు మైలవరంలో దిక్కులేదు.. గద్దె రామ్మోహన్ ను ఎటు పొమ్మంటారో ఆయనకే తెలియదు. తూర్పు నియోజకవర్గంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరటం ఖాయం అని జోష్యం చెప్పారు.


Next Story