తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని సవాల్ విసిరారు. మంత్రి పదవులపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం శిరోధార్యం అన్నారు నారాయణస్వామి. పదవులు ఉన్నా లేకున్నా వైఎస్ జగన్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. అన్ని అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌పై నేను పోటీ చేస్తా అన్న చంద్రబాబు.. నేడు ఆ తెలుగుదేశం పార్టీ వారసులుగా ఎలా చలామణి అవుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం వుంటే.. కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని.. అలా గెలిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు.