ఆంధ్రప్రదేశ్ ను మద్యాంద్రప్రదేశ్ గా మార్చడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమా.? అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు తానిచ్చిన దశలవారీ మద్యపాన నిషేధ అమలు హామీని జగన్ తుంగలో తొక్కారని విమర్శించారు. ఏడాదికి రూ.9 వేల కోట్ల ఆదాయం నుండి రూ.36 వేల కోట్లకు పెంచడమే మధ్య నిషేధమా? అంటూ నిదీశారు. ఈ ఏడాది బార్ల లైసెన్సుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలే పోటీలు పడ్డారని ఆరోపించారు. సీఎం సొంత జిల్లా కడపలోనే అత్యధిక మొత్తం చెల్లించి బార్ల లైసెన్సులు పొందటం విచారకరం అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పిన వ్యక్తిగా ప్రజలు గుర్తించారని రామకృష్ణ విమర్శించారు.