పదేపదే ద్రోహం చేస్తున్నా పట్టదా.?

CPI Rama Krishna Fire On CM Jagan. ఏపీకి కేంద్రం పదేపదే ద్రోహం చేస్తున్నా జగన్ మోహ‌న్‌ రెడ్డికి పట్టదా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

By Medi Samrat  Published on  28 Sept 2022 3:07 PM IST
పదేపదే ద్రోహం చేస్తున్నా పట్టదా.?

ఏపీకి కేంద్రం పదేపదే ద్రోహం చేస్తున్నా జగన్ మోహ‌న్‌ రెడ్డికి పట్టదా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును కూడా కేంద్రం తుంగలో తొక్కింది. ఏపీకి ప్రత్యేక హోదా లేదు. విభజన హామీల అమలు లేదు. విశాఖ రైల్వే జోన్ లేదు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం లేదు. రెవిన్యూ లోటు భర్తీ లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం తెగనమ్ముతుంటే జగన్‌ చోద్యం చూస్తున్నారని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్ మోహ‌న్ రెడ్డి ఇప్పుడు 31 మంది వైసీపీ ఎంపీలు ఉన్నా చేతులు ముడుచుకున్నార‌ని ఎద్దేవా చేశారు. 31 మంది ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచితే ఏపీకి ఎందుకు న్యాయం జరగదు? ఏపీ ప్రజల భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి తాకట్టు పెట్టారని.విమ‌ర్శించారు. మాటతప్పి మడమ తిప్పటమే జగన్ మోహ‌న్‌ రెడ్డికి అలవాటుగా మారిందని రామకృష్ణ విమ‌ర్శ‌లు గుప్పించారు.


Next Story