విజయ్ పాల్ కు 14 రోజుల రిమాండ్

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

By Kalasani Durgapraveen  Published on  27 Nov 2024 2:00 PM GMT
విజయ్ పాల్ కు 14 రోజుల రిమాండ్

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయపాల్ ను నిన్న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు ఆయనను గుంటూరు తరలించి, కోర్టులో హాజరుపరిచారు. విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. దీని వెనుక కుట్రదారులు ఎవరో తేలాలంటే విజయపాల్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. దీంతో న్యాయస్థానం విజయపాల్ కు రెండు వారాల రిమాండ్ విధించింది. విజ‌య్‌పాల్ బెయిల్ పిటిష‌న్‌ను ఇటీవ‌ల సుప్రీంకోర్టు కొట్టివేసింది.

విజ‌య్‌పాల్ అరెస్ట్ పై ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణరాజు స్పందించారు. క‌స్ట‌డీలో త‌న‌ను హింసించిన వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాల‌కు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని అన్నారు.

Next Story