ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న జకియా ఖానం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు. జకియా ఖానం తాజా రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల జాబితా మరింత పెరిగింది. జకియా ఖానంతో కలిపి ఇప్పటి వరకు వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పటికే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ తమ రాజీనామాలు సమ ర్పించారు. తాజాగా జకియా ఖానం రాజీనామా లేఖను తన వ్యక్తిగత సిబ్బందితో శాసనమండలి ఛైర్మన్‌కు పంపించారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తే డిప్యూటీ చైర్మన్ పదవి కూడా పోతుంది.
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం 2020 జులైలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అనంతరం ఆమె శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా కూడా ఎన్నికయ్యారు. అయితే, దాదాపు రెండేళ్లుగా ఆమె వైసీపీ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.