రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కనీస మద్దతు ధర రూ.8,110తో రేపటి నుంచే పత్తి కొనుగోళ్లు

రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.

By -  Medi Samrat
Published on : 28 Oct 2025 1:35 PM IST

రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కనీస మద్దతు ధర రూ.8,110తో రేపటి నుంచే పత్తి కొనుగోళ్లు

రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెంథా తుఫాను తీవ్రత నేపథ్యంలో, రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే ప్రత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలుకు రూ. 8,110/- కనీస మద్దతు ధరను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు కొనుగోలు ప్రక్రియను సక్రమంగా పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత "కపాస్ కిసాన్" యాప్‌లో అదే విఏఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకొని, స్లాట్ ప్రకారం సిసిఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు కేంద్రాల ద్వారా (జిన్నింగ్ మిల్లుల ద్వారా) మాత్రమే పత్తిని అమ్ముకోవాలని కోరారు. ఇందుకోసం జిల్లా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ, విఏఏ లు రైతులకు పూర్తి సహకారం అందించేలా పర్యవేక్షించి, కొనుగోలును విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

Next Story