'తిరుపతిలో జగన్‌పై దాడికి కుట్ర'.. వైసీపీ సంచలన ఆరోపణ
తిరుపతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడికి కూటమి కుట్ర పన్నుతోందని వైసీపీ ఆరోపించింది.
By అంజి Published on 27 Sep 2024 7:13 AM GMT'తిరుపతిలో జగన్‌పై దాడికి కుట్ర'.. వైసీపీ సంచలన ఆరోపణ
తిరుపతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడికి కూటమి కుట్ర పన్నుతోందని వైసీపీ ఆరోపించింది. ''తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్‌పై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి, జనసేన నేత కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్టు సమాచారం. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంక్యలో మనుషుల్ని పురమాయించినట్టు తెలుస్తోంది. జగన్ తిరుమ పర్యటనతో లడ్డూ ఇష్యూలో మీ బండారం బయటపడుతుందని భయపడుతున్నారా చంద్రబాబు?'' అని వైసీపీ ట్వీట్ చేసింది.
వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై చంద్రబాబుకు ఇంత భయం ఎందుకు? అని వైసీపీ ప్రశ్నించింది. అటు అక్టోబర్ 24 వరకు తిరుపతి జిల్లాలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు జగన్ తిరుమలకు రానున్న సందర్భంగా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుమల వెళ్లొద్దంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష తదితర నేతలకు నోటీసులు ఇచ్చారు.