రాజకీయాలకు సంబంధించిన‌ యాత్ర కాదు.. ఆ విషయంలో పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయం

Congress Leader Rahul Gandhi Press Meet. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది.

By Medi Samrat  Published on  19 Oct 2022 10:45 AM GMT
రాజకీయాలకు సంబంధించిన‌ యాత్ర కాదు.. ఆ విషయంలో పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా కూడా ఇచ్చిన హామీల్లో ఉంది. ఏపీలో కాంగ్రెస్ ను పునర్నిర్మాణం చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏపీకి ఒకే రాజధాని ఉండాలని.. 3 రాజధానుల నిర్ణయం సరైనది కాదని రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం కోసం ఏపీలో వైసీపీతో కలిసి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ఆ విషయంలో నేను నిర్ణయం తీసుకోలేను. పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయం అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత ప్రజాస్వామ్యం మరే పార్టీలోనూ లేదు. ఈ యాత్ర రాజకీయాలకు సంబంధించి కాదని అన్నారు.


భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నూలులో పాదయాత్ర చేస్తోన్న రాహుల్ గాంధీ.. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ రాజకీయాల్లో ఎవరితో పొత్తులు అనేది అధ్యక్షునిదే తుది నిర్ణయమని రాహుల్ గాంధీ చెప్పారు. తాను ఎలాంటి పాత్ర పోషించాలనేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారన్నారు. గతంలో జరిగిన రాష్ట్ర విభజన గురించి కాకుండా భవిష్యత్ గురించి ఆలోచించాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్‌లో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ ఉండదని, కాంగ్రెస్‌లో తప్ప ఏ పార్టీలోనూ నేతలు అసంతృప్తి బహిరంగంగా తెలియజేయరని రాహుల్ చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలలో డిక్టేటర్ షిఫ్ ఉంటుంది కాబట్టి ఇతర నేతలు ఎవరూ మాట్లాడలేరన్నారు.





Next Story