పవన్ కళ్యాణ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ కేఏ పాల్‌

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు వ్యవహరం లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ.. సమాజం లో ఆమాటల మూలంగా అశాంతి వాతావరణం ఏర్పడిందని ఆయన పై పిర్యాదు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  7 Oct 2024 12:45 PM GMT
పవన్ కళ్యాణ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ కేఏ పాల్‌

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు వ్యవహరం లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ.. సమాజం లో ఆ మాటల మూలంగా అశాంతి వాతావరణం ఏర్పడిందని ఆయన పై పిర్యాదు చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె. ఏ. పాల్. తన పిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్.ఐ.అర్ నమోదు చేయాలని అయన పంజాగుట్ట పోలీసులను కోరారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రాన్నివైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపవిత్రం చేశారని.. తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ల్యాబ్ టెస్ట్‌ల్లో వెల్లడైందని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు దేశం మొత్తాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. ఈ వివాదం విషయమై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలకు తావిస్తోంది.

ఈ పరిస్థితులలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన పిర్యాదు మరింత చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేఏ పాల్ సంచలన డిమాండ్‌ను లేవనెత్తారు. ఇదే విషయంపై ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన కేఏ పాల్ కీలక విషయాలను వెల్లడించారు. తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయకపోతే.. ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే పోరాటం చేస్తామని కేఏ పాల్ హెచ్చరికలు జారీ చేశారు.

Next Story