వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని ఫైర్ అయ్యారు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలన్నారు. 'రప్పా రప్పా నరికేస్తాం అని అరవడం కాదు. ఇంకా అదే పనా? చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు అసహ్యంగా ఏంటి ఇది? రాత్రికి రాత్రే అంతా జరిగిపోవాలి. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని రేపు మన ప్రభుత్వం వచ్చాక కరిచేయ్. దాన్ని ఎవరికైనా చెప్పాలా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియనట్టుగా పరామర్శించాలి' అని కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్తలతో భేటీలో మాట్లాడారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా పేర్ని నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.