ఈ నెల 13న విశాఖకు సీఎం జగన్

CM YS Jagan to visit Visakhapatnam on July 13. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారయ్యింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు

By అంజి  Published on  11 July 2022 2:06 PM IST
ఈ నెల 13న విశాఖకు సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారయ్యింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఉదయం 11:00 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్‌కి వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను 11.05 నుంచి 11.15 గంటల వరకు సందర్శిస్తారు. అనంతరం వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తారు. అనంతరం వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్‌ ఉంటుంది.

షెడ్యూల్‌లో భాగంగా.. ఉదయం 11.40 నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు, అనంతరం 11.45 నుంచి 11.47 వరకు 'వాహన మిత్ర' అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 11.47 నుంచి 12.17 గంటల వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించి, మధ్యాహ్నం 12.20 గంటల నుంచి వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. విమానాశ్రయంలో 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. ఆ తర్వాత 1.20 గంటలకు గన్నవరంకు తిరుగుపయనం అవుతారు.

Next Story