రేపు తూర్పు గోదావరిలో సీఎం జగన్‌ పర్యటన

CM YS Jagan to visit East Godavari tomorrow, to lay foundation for Assago Industries Pvt Ltd. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

By అంజి  Published on  3 Nov 2022 2:13 PM IST
రేపు తూర్పు గోదావరిలో సీఎం జగన్‌ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ అధికారిక పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలిప్యాడ్‌కు చేరుకుని 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు.

ఉదయం 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 11.45 గంటలకు వేదిక నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో 11.50 గంటలకు గుమ్మలదొడ్డి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు.

Next Story