పులివెందులలో ఆంద్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 59 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సాధించిన 90 వేల ఓట్ల మెజారిటీ.. ఈ సారికి 59 వేలకు తగ్గింది. వైసీపీ ఘోర పరాజయం పొందిన సమయంలో ఆ పార్లీకి ఇది ఉపశమనం కలిగించే వార్త.
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. టీడీపీ 133, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అధికార పార్టీ వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ప్రస్తుతం కేవలం 13 సీట్లలో లీడింగ్‌లో కొనసాగుతోంది.
ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కన్ఫామ్ అయిపోయింది. కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రం ఖాయం. ఈ క్రమంలోనే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తారనే చర్చ జరుగుతోంది.