నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే!

మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.

By Medi Samrat
Published on : 1 April 2024 7:15 AM IST

నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే!

మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్పీ కొట్టల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్ ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బస చేస్తారు.

ఆదివారం నాడు బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చారు సీఎం జగన్‌. ధర్మవరం నియోజకవర్గంలోని సంజీవపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్‌ను జరుపుకున్నారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీలు నిర్వహించారు.

Next Story