ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత పర్యటన ముగించుకుని కొద్దిసేప‌టి క్రితం తాడేపల్లి చేరుకున్నారు. దీంతో మ‌ళ్లీ అధికారిక కార్య‌క్ర‌మాల్లో బిజీ కానున్నారు. సీఎం జగన్‌ రేపు, ఎల్లుండి వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో పర్య‌టించ‌నున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ముఖ్యమంత్రి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో భేటీ అవుతారు. రాత్రికి వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.

2వ తేదీ ఉదయం 9.30 గంటలకు సీఎం జ‌గ‌న్ తండ్రి, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. వైఎస్ఆర్‌కు నివాళులు అర్పించిన అనంత‌రం పార్టీ నాయకులతో మాట్లాడుతారు. అనంత‌రం ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


సామ్రాట్

Next Story