టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్

CM YS Jagan inaugurates tourist police stations across the state for the safety of tourists. పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

By అంజి  Published on  14 Feb 2023 2:03 PM IST
టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్

పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాలలో పర్యాటక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమం చేపట్టామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. పోలీసులే మీ స్నేహితులు అనే కాన్సెప్ట్ తీసుకురాగలిగామని, గతంలో లేని విధంగా పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామన్నారు.

పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులను ఉంచే కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యాటకుల భద్రత కోసం 20 పర్యాటక ప్రాంతాల్లో ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వైఎస్ జగన్ తెలిపారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్‌ పోలీస్‌ బూత్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. పోలీస్ బూత్‌తో పాటు 10 ద్విచక్ర వాహనాలు, రెండు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు.

Next Story