AP: రైతన్నకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు

మిచాంగ్‌ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By అంజి  Published on  4 March 2024 6:49 AM IST
CM YS Jagan, APgovt, input subsidy, farmers

AP: రైతన్నకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు

మిచాంగ్‌ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నాడు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్‌లో ఏర్పడిన కరువుతో పాటు తుఫానుతో నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1294.58 కోట్లు అందించనున్నారు. గత ఐదేళ్లో రూ.3,271 కోట్లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే వైఎస్సార్‌ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించారు. ఇప్పుడు మరోసారి రైతులకు సాయం అందిస్తున్నారు.

వర్షాభావంతో గతేడాది ఖరీఫ్‌లో 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. మిచాంగ్‌ తుపాన్‌ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని అధికారులు అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు.

Next Story