CM YS Jagan : ఇస్రో ప్రయోగం విజయవంతం.. చ‌రిత్ర‌లో ముఖ్య‌మైన రోజుగా నిలిచిపోతుంద‌న్న సీఎం జ‌గ‌న్

ఇస్రో చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీని ప‌ట్ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2023 6:28 AM GMT
CM YS Jagan : ఇస్రో ప్రయోగం విజయవంతం.. చ‌రిత్ర‌లో ముఖ్య‌మైన రోజుగా నిలిచిపోతుంద‌న్న సీఎం జ‌గ‌న్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీని ప‌ట్ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇస్రో బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. భ‌విష్య‌త్తులో ఇస్రో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని సీఎం ఆకాంక్షించారు. భార‌త అంత‌రిక్ష చ‌రిత్ర‌లో ఈ రోజు ఒక ముఖ్య‌మైన మైలురాయిగా ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది అంటూ ట్వీట్ చేశారు.

ఇస్రో పంపిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. ఆదివారం ఉదయం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) లో ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు షార్ ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నింగిలోకి ప్రయాణం ప్రారంభించింది. వన్ వెబ్ కు చెందిన మొత్తం 36 ఉపగ్రహాలతో బయల్దేరింది. దాదాపు 20 నిమిషాల ప్రయాణం తర్వాత భూమి ఉపరితలం నుంచి 450 కి.మి. చేరుకుంది. మోసుకెళ్లిన ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా లియో ఆర్బిటల్ వృత్తాకార కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టింది.

Next Story