నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం

సీఎం చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.

By -  Knakam Karthik
Published on : 1 Oct 2025 6:47 AM IST

Andrapradesh, Cm Chandrababu, Vizianagaram District, NTR Bharosa pensions

నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం

అమరావతి: సీఎం చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గజపతినగరం మండలంలోని దత్తి గ్రామంలో ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత జిల్లాలోని పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు నేరుగా విశాఖ చేరుకుని ..అక్కడి నుంచి గజపతినగరం నియోజకవర్గం దత్తికి వెళ్లారు. విజయనగరం జిల్లా పర్యటన ముగిసిన అనంతరం అమరావతికి బయలుదేరి వెళతారు.

Next Story