అనకాపల్లి పేలుడు ఘటన.. సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి జిల్లా కైలాసపట్నం కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
By అంజి
అనకాపల్లి పేలుడు ఘటన.. సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి జిల్లా కైలాసపట్నం కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాము. ధైర్యంగా ఉండాలని కోరారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని ఆదేశించాను. అటు ఈ ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. బాధితులంతా సామర్లకోటకు చెందిన వారిగా గుర్తించినట్టు వెల్లడించారు.
‘‘ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదొక దురదృష్టకర ఘటన. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ఏపీ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.