పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం సమీక్ష
సోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోని సమావేశ మందిరంలో మంత్రులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ఇరిగేషన్ , మైల్, అనుబంధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, దిశా నిర్దేశనం చెయ్యడం జరిగింది.
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 11:30 AM GMTసోమవారం ఉదయం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోని సమావేశ మందిరంలో మంత్రులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ఇరిగేషన్ , మైల్, అనుబంధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, దిశా నిర్దేశనం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ పనులని యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలన్నారు. అందుకు నిర్దేశించిన పనుల విషయంలోను, టైమ్ లైన్స్ లక్ష్యాలను ముందుగా చెయ్యాల్సి ఉందన్నారు. వాస్తవత దృక్పథం తో పనులు పూర్తి చెయ్యడం, అందుకు అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించే క్రమంలో అధికారులు మరింత సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు, మెగా కంపనీ ప్రతినిధులు సాంకేతిక పరమైన అంశాలను గుర్తించి ఖచ్చితత్వం తో కూడి నిర్దుష్ట కాలములో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. వొచ్చే సమావేశంలో పనుల పురోగతి, ప్రణాళిక అంశాల ప్రగతి పై సమీక్షా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మైలు రాళ్ళు చేరుకునేలా సాంకేతిక పరమైన అంశాలను గుర్తించి అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. ఈ సీ ఆర్ ఎఫ్, డయ ఫ్రమ్ వాల్వ్ పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు. ఈ సి ఆర్ ఎఫ్ గ్యాప్ 1 ను డిసెంబర్ 24 నుంచి ఫిబ్రవరి 26 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలుపుగా డిసెంబర్ 25 నాటికి పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్యాప్ 2 పనులు డిసెంబర్ 27 నాటికి బదులు ముందుగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర అనుబంధ పనులు మూడా సమాంతరంగా నిర్వహిస్తూ, యుద్ద ప్రాతిపదికన వేగవంతం చెయ్యాల్సి ఉంటుందన్నారు. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అనుసంధానం చేసే పనులు పూర్తి చెయ్యడం, అందుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. మెటీరియల్, ట్రెయిల్ రన్, సామాగ్రి తరలింపు అంశాల పై నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆచరణలో పెట్టడానికి అధికారులు, కాంట్రాక్టర్లు కట్టుబడి ఉండాలన్నారు.
భూసేకరణ కి సంబంధించిన మానవ వనరులు మంజూరు చెయ్యడం జరుగుతుందని , పర్యవేక్షణా చెయ్యడం కోసం నిబద్ధత కలిగిన అధికారిని నియమిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 26 జూన్ నాటికి భూసేకరణ సంబంధించి అన్ని పనులు పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు.
మార్గదర్శకాలు మేరకు అవసరమైన అనుమతులు మంజూరు కు ప్రతిపాదనలు పంపడం జరగాల్సి ఉందన్నారు. యుద్ద ప్రాతిపదికన పనులను వేగవంతం చేయాలని, అందుకు నిర్దేశించిన లక్ష్యాలను ముందుగా చెయ్యాల్సి ఉందన్నారు. వాస్తవంగా పనులు పూర్తి చెయ్యడం, అందుకు అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించే క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ ను ఒక ఐకానిక్ ప్రోజెక్ట్ గా ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావాలని, అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. పనుల విషయంలో, పునరావాస తదితర అంశాల ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే పోలవరం ప్రాజెక్ట్ పనులు చేపట్టడం జరగాల్సిన అవసరం ఉందన్నారు.