నేడు మూడు నియోజక వర్గాల్లో సీఎం జగన్‌ పర్యటన

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించ‌నున్నారు.

By Medi Samrat  Published on  4 May 2024 8:51 AM IST
నేడు మూడు నియోజక వర్గాల్లో సీఎం జగన్‌ పర్యటన

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురం, మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరు, మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు సిటీ ప్రచార సభల్లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం కాకినాడలో పర్యటించనున్నారు. కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. సినీ హీరో నారా రోహిత్ ఈ రోజు పలాస, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభ తో పాటు రోడ్ షోలో నారా రోహిత్ పాల్గొన‌నున్నారు.

Next Story