ఎల్లుండి సీఎం జగన్‌ నార్పల పర్యటన

CM Jagan's visit to Narpala on 26th. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం వైఎస్‌ జగన్ ఎల్లుండి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం

By Medi Samrat
Published on : 24 April 2023 2:39 PM IST

ఎల్లుండి సీఎం జగన్‌ నార్పల పర్యటన

CM Jagan


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం వైఎస్‌ జగన్ ఎల్లుండి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. బుధ‌వారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 10.40 – 12.35 గంటల వరకు నార్పల క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంత‌రం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం – లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం పూర్తైన అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు నార్పల నుంచి బయలుదేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story