పట్టా ఇవ్వడమే కాదు.. లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలి

CM Jagan's review of housing department. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జ‌గ‌న్‌

By Medi Samrat  Published on  1 Aug 2022 10:52 AM GMT
పట్టా ఇవ్వడమే కాదు.. లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలి

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జ‌గ‌న్‌ సమీక్షించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలని అధికారుల‌ను ఆదేశించారు. నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. చేసిన పనులకు నిధులుకూడా సక్రమంగా విడుదల చేస్తున్నాం.. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణపనులు కూడా వేగంగా జరగాలని ఆదేశించారు. విశాఖపట్నంలో ఇచ్చిన 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్నిరకాలుగా సిద్ధంచేస్తున్నామ‌ని అధికారులు సీఎంకు తెలిపారు.

అక్టోబరు చివరినాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని వివ‌రించారు. నిర్మాణం వేగంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆప్షన్‌ మూడు కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలూ కూడా వేగంగా సాగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇళ్ల నిర్మాణంతోపాటు.. కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనా పనులపైన దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన జరగాలని అన్నారు. కాలనీల్లో పనుల ప్రగతి సమీక్షించడానికి, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని అక్కడనుంచే ఏర్పాటు చేశామని అధికారులు సీఎంకు వివ‌రించారు. ప్రత్యేకించి ఒక పోన్‌ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రగతిని కూడా సీఎం సమీక్షించారు. 15–20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సర్వం సిద్ధం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని సీఎం ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ వేగవంతం చేయాలని సీఎం అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. వీటి నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.

90 రోజుల్లో ఇంటిపట్టా కార్యక్రమాపై కూడా సీఎం సమీక్షించారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని కొత్తగా తేల్చామని.. వీరిలో ఇప్పటికే లక్షమందికి పట్టాలు అందించామని సీఎంకు అధికారులు వివ‌రించారు. మిగతావారికీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పట్టా ఇవ్వడమే కాదు.. లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలని సీఎం ఆదేశించారు.




Next Story