రేపు సీఎం జగన్‌ తెనాలి పర్యటన

CM Jagan will visit Tenali tomorrow. రేపు సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించ‌నున్నారు.

By Medi Samrat  Published on  27 Feb 2023 8:55 AM GMT
రేపు సీఎం జగన్‌ తెనాలి పర్యటన

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. 10.35 గంటలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుని నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేర‌కు సీఎంఓ అధికారులు ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.


Next Story