రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన

CM Jagan will visit Guntur district tomorrow. ఏపీ సీఎం జగన్ రేపు గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  23 July 2023 10:15 AM GMT
రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌చ‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్‌ సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్‌) పేదల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్‌ లే అవుట్‌కు చేరుకుంటారు. అక్కడ వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇళ్ళ నిర్మాణ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే మోడల్‌ హౌస్‌ను పరిశీలించిన అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story