ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు తిరిగి చేరుకోనున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే.. ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ తన పర్యటన ముగించుకుని శుక్రవారం నాడు ఏపీకి చేరుకోనున్నారు. ఇవాళ రాత్రి లండన్ నుండి తిరుగు ప్రయాణం కానున్న సీఎం జగన్.. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత తాడేపల్లిలోని తన ఇంటికి వెళ్లనున్నారు.
సీఎం జగన్ మే 17న కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌కు వెళ్లారు. లండన్ నుండి యూరప్ లోని కొన్ని దేశాలలో కూడా పర్యటించారు. రెండు వారాలకు పైగా విదేశాల్లో గడిపిన అనంతరం రాష్ట్రానికి రానున్నారు. గత ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో కూడా అదే ఫలితాలను అందుకుంటుందని సీఎం జగన్ చాలా సార్లు చెప్పారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, జూన్ 4న ఫలితాలు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.