రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా మదనపల్లె చేరుకున్నారు. సీఎం జగన్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం ప‌లికిన వారిలో‌ డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన రాష్ట్రపతి చిప్పిలి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌‌లో దిగారు. అక్కడి నుంచి ఆయ‌న సుప్రసిద్ధ తత్వవేత్త ముంతాజ్‌ అలీకి చెందిన సత్సంగ్ ఆశ్రమానికి బయలుదేరారు.

ఆశ్రమంలో పలు నిర్మాణాలకు, స్వస్థ్య ఆస్పత్రికి రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భారత్‌ యోగా విద్యా కేంద్రకు సంబంధించిన యోగా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సదుం మండలంలో ముంతాజ్‌ అలీ నిర్వహిస్తున్న పాఠశాలకు వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంత‌రం హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళుతారు.సామ్రాట్

Next Story