రేపు విశాఖలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

CM Jagan vizag tour on February 27th.సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రేపు(ఆదివారం) విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2022 11:14 AM IST
రేపు విశాఖలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రేపు(ఆదివారం) విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మిలాన్‌–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన‌నున్నారు.

విశాఖ‌లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ వివ‌రాలు

ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం విశాఖ చేరుకుంటారు. అక్క‌డి నుంచి నేవల్ డాక్ యార్డ్ కు వెళతారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంత‌రం ఐఎన్ఎస్ వేలా సబ్ మెరైన్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్ కు వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్-2022లో సీఎం పాల్గొని, ప్రసంగిస్తారు. రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు తిరుగుప్ర‌యాణం అవుతారు. సీఎం విశాఖ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అధికారులు అన్నీ ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు.


Next Story